అక్వాన్ తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం

అక్వాన్ తుఫాన్ తీరం దాటే ప్రక్రియ మొదలైందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. బాహ్యవలయం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను తాకిందని, శుక్రవారం ఉదయం గోపాల్‌పూర్ వద్ద పూర్తిగా తీరం దాటనుందని పేర్కొంది.
గత 6 గంటల్లో గంటకు 21 కి.మీ. వేగంతో కదిలిన తుఫాన్.. కళింగపట్నానికి 110 కి.మీ., విశాఖపట్నం, గోపాల్‌పూర్‌లకు 170 కి.మీ. దూరంలో ఉంది. నేడు శ్రీకాకుళంలో భారీ, ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
Comments
Loading comments...
