వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం అలజంగి వేగావతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఇసుక తరలిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కొల్లి రాంకుమార్, VRO, VRAలు కలిసి ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని ఎమ్మార్వో కార్యాలయానికి తరలించారు.
ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా నివారణకు సహకరించాలన్నారు.
Comments
Loading comments...

