వార్తలకు తిరిగి వెళ్లండి

ధన్వాడ మండలం గోటూరులో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఇన్‌ఛార్జ్ ఎస్‌ఐ మహేశ్వరి సిబ్బందితో దాడులు నిర్వహించి ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.
ట్రాక్టర్ ఓనర్లు రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్‌లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

