వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామం నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ రామచంద్రాన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. యజమాని వట్టెల రవి ఆదేశాల మేరకు ఇసుక తరలిస్తున్నట్లు తెలిపాడన్నారు.
ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.
Comments
Loading comments...

