వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో విమానాశ్రయ నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టడంతో అనుకుంట మీదుగా జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి మూసివేయనున్నారు. దీంతో 30 గ్రామాల ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు.
కచికంటి–బంగారుగూడ మార్గంలో 66 అడుగుల వెడల్పుతో కొత్త రహదారి నిర్మించనుండగా, ఇందుకోసం ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. కొత్త దారి అందుబాటులోకి వస్తే రాకపోకలు సులభం కానున్నాయి.
Comments
Loading comments...

