Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐలమ్మ పోరాటం మతాల మధ్య జరిగింది కాదు

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 3:09 PM నిజామాబాద్General
ఐలమ్మ పోరాటం మతాల మధ్య జరిగింది కాదు - Udayam
చిట్యాల ఐలమ్మ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించడమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సీపీఎం కార్యాలయంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, అక్రమ పన్నులకు వ్యతిరేకంగా పేద రైతులు, కూలీలు సాగించిన పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని తెలిపారు.

Comments

G
Loading comments...