Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదేళ్లుగా పరారీలో ఉన్న గంజాయి కేసు నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
B Ganga Aug 23, 2026 10:00 AM పార్వతీపురం మన్యంGeneral
ఐదేళ్లుగా పరారీలో ఉన్న గంజాయి కేసు నిందితుడి అరెస్ట్ - Udayam
గంజాయి అక్రమ రవాణా కేసులో ఐదేళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని సాలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. జీగరం గ్రామ శివారులోని ఎన్హెచ్-26పై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన ఒడిశాకు చెందిన సంజిత్ ఖార్ (27)ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...