వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం, క్లౌడ్ పెట్టుబడులు పెరుగుతుండటంతో 2025లో 2.2 గిగావాట్లుగా ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యం 2030 నాటికి 12 గిగావాట్లకు చేరుతుందని వుడ్ మెకెంజీ నివేదిక తెలిపింది.
ఏఐ కోసం కేటాయించిన సామర్థ్యం 2025లో 275 మెగావాట్ల నుంచి 2030 నాటికి 6,546 మెగావాట్లకు పెరగనుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ, విపరీతమైన ఇంటర్నెట్ వినియోగం ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొన్నారు.
Comments
Loading comments...
