వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీశ్‌కుమార్ రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ (అనిశా) అధికారులకు దొరికిపోయారు. అభివృద్ధి పనుల బిల్లుల విడుదలకు లంచం డిమాండ్ చేయడంతో గుత్తేదారు అధికారులను ఆశ్రయించారు.
మంగళవారం ఏఈ నివాసంలో లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. అనంతరం జరిపిన సోదాల్లో ఏఈ ఇంట్లో రూ. 32 లక్షల అదనపు నగదు లభించగా, సతీశ్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
Comments
Loading comments...

