వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లాలో అడవి పందులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని భైంసా రేంజ్ అటవీ అధికారులు పట్టుకున్నారు. బాసర నుంచి నవీపేట్ సమీపం వరకు చేజ్ చేసి, 14 అడవి పందులను స్వాధీనం చేసుకున్నారు. అధికారులను చూసి వాహనంలోని ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు.
నాందేడ్ నుంచి వీటిని తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అటవీ శాఖ కేసు నమోదు చేసి, పరారైన నిందితుల కోసం గాలింపు చేపట్టింది.
Comments
Loading comments...

