వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్లపై పశువుల సంచారంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నందున చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత తెలిపారు. ఇకపై పశువులను రోడ్లపై వదిలే యజమానులను ఉపేక్షించేది లేదని చెప్పారు.
రోడ్లపై సంచరించే పశువులను షెడ్డుకు తరలించి, అనంతరం జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. పశువులను యజమానులు ఇంటి వద్ద జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

