Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో వరద ప్రాంతాల్లో అచ్చెన్నాయుడు పర్యటన

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 12:00 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో వరద ప్రాంతాల్లో అచ్చెన్నాయుడు పర్యటన - Udayam
శ్రీకాకుళం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం పర్యటించారు. సంతబొమ్మాళి మండలంలోని వడ్డివాడ, అంట్లవరం, వడ్డితాండ్రలో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం పలు గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి పంట నష్టంపై వివరాలు సేకరించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...