Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట ATMలో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 1:39 PM పల్నాడుGeneral
అచ్చంపేట ATMలో అగ్నిప్రమాదం - Udayam
పల్నాడు జిల్లా అచ్చంపేటలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో షార్ట్ సర్క్యూట్‌ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంతో ఏటీఎం నుండి దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ఇరువైపులా ఉన్న వస్త్ర దుకాణాల వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సకాలంలో కరెంట్ ఆపడంతో పెను ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...