వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని లక్షెట్టిపేట మండలంలోని పలు గ్రామాల సర్పంచులు కోరారు. లక్షెట్టిపేట మండల నూతన ఎంపీఓగా జి. అనిల్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో ఆయనను కలిసి అభినందించారు.
అనంతరం నూతన ఎంపీఓ మాట్లాడుతూ అన్ని గ్రామాల అభివృద్ధికి దృష్టి పెడతానని తెలిపారు. కాగా నూతన ఎంపీఓను ఎంపీడీవో మధుసూదన్, అధికారులు అభినందించారు.
Comments
Loading comments...

