వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల మండలం ముద్దాడ పంచాయతీ సెగిడిపేటలో మండల పరిషత్ జనరల్ ఫండ్ నిధులు రూ.4 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లు, డ్రైన్లను ఎంపీపీ మొదలవలస చిరంజీవి శుక్రవారం ప్రారంభించారు.
గత ఐదేళ్లలో ప్రతి గ్రామంలో మండల పరిషత్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బెందు రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

