వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి మండలం ఊటకొండకు చెందిన తెలుగు లీలావతి ఆటోలో డోన్‌కు వస్తూ తన బ్యాగ్‌ను మరిచిపోయారు. బ్యాగ్‌లో రూ.8,500 నగదు, మొబైల్, ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి.
కొచ్చెర్వు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్లు సాంబ, శ్రీనివాసులు బ్యాగ్‌ను డోన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. సీఐ ఇంతియాజ్ ఆదేశాల మేరకు లీలావతిని పిలిపించి వస్తువులను తిరిగి అందజేశారు. నిజాయితీగా ఉన్న ఆటో డ్రైవర్లను అభినందించారు.
Comments
Loading comments...

