వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని లక్షెట్టిపేట మండల ఎంపీడీవో మధుసూదన్, ఎంఈఓ శైలజ కోరారు. బుధవారం మధ్యాహ్నం వారు లక్షెట్టిపేట పట్టణంలోని బాలికల ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

