Udayam Digital
Menu

ఆరు రోజులకే డీమ్యాట్‌ ఖాతా.. చిన్నారి రికార్డు

Shruthi Nov 18, 2026 8:08 PM జాతీయంవాణిజ్యం
ఆరు రోజులకే డీమ్యాట్‌ ఖాతా.. చిన్నారి రికార్డు - Udayam Digital
దిల్లీకి చెందిన ఆర్యా గోయల్‌ పుట్టిన ఆరు రోజులకే డీమ్యాట్‌ ఖాతా పొందింది. దీంతో దేశంలోనే అత్యంత పిన్న వయసు డీమ్యాట్‌ ఖాతాదారుగా రికార్డు సృష్టించింది. గతంలో 12 రోజుల శిశువు పేరిట ఈ రికార్డు ఉండేది. తల్లిదండ్రులు పాకెట్‌ఫుల్‌ ద్వారా ఆమె పేరుతో మైనర్‌ ఖాతా తెరిచారు. చిన్నారికి 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులే ఈ ఖాతాను నిర్వహిస్తారు. ఇందుకు ఆధార్‌, మైనర్‌ పాన్‌ కార్డు, బ్యాంకు ఖాతా అవసరం.

Comments

G
Loading comments...