Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంక్షలు ఎత్తివేసి అభివృద్ధికి బాటలు వెయ్యాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 04, 2026 12:13 PM మంచిర్యాలGeneral
ఆంక్షలు ఎత్తివేసి అభివృద్ధికి బాటలు వెయ్యాలి - Udayam
అటవీ ఆంక్షలు ఎత్తివేసి జన్నారం మండల అభివృద్ధికి బాటలు వెయ్యాలని తాపీ మేస్త్రి సంఘం జన్నారం మండలం నాయకులు కోరారు. అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జన్నారంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక వేత్త భూమాచారికి శుక్రవారం వారు మద్దతు తెలిపారు. అటవీ ఆంక్షలతో అభివృద్ధి ఆగిపోయి ఉపాధి దొరకడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాపీ మేస్త్రి సంఘం నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...