Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలసలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

Follow Udayam on Google
Jogarao Sep 22, 2026 3:56 PM శ్రీకాకుళంGeneral
ఆమదాలవలసలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం - Udayam
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆమదాలవలస మండలం వ్యాప్తంగా పలు గ్రామాలలో మంగళవారం వేకువ జాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు వాగులు వంకలు నీటితో నిండిపోయాయి. నదీ తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...