Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయంలో చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
B RAJESH Aug 25, 2026 8:52 PM విజయనగరంGeneral
ఆలయంలో చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్ - Udayam
గరుగుబిల్లి (M) సన్యాసిరాజుపేటలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 19న ఆలయంలోకి చొరబడి నాగభరణం కిరీటాలు, శతగోపం, తదితర వెండి వస్తువులను అపహరించారు. పోతినమల్లయ్య పాలెంకు చెందిన నిందితుడు సత్యసూర్య కుమార్ను మూడు రోజులుగా గాలించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రికవరీ వస్తువులను రికవరీ చేసుకొని కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ ఫక్రుద్దీన్ మంగళవారం తెలిపారు.

Comments

G
Loading comments...