Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ గ్రిల్స్‌తో దివ్యాంగులకు ఇబ్బందులు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 11:54 AM జోగులాంబ గద్వాల్ General
ఆలయ గ్రిల్స్‌తో దివ్యాంగులకు ఇబ్బందులు - Udayam
అలంపూర్‌ ఆలయంలో ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్‌ దివ్యాంగులకు ఇబ్బందిగా మారాయి. దర్శనానికి వచ్చిన ఓ దివ్యాంగుడు కర్రల సాయంతో నడుస్తుండగా.. అవి నేలపై ఉన్న ఇనుప చట్రం ఖాళీల్లో ఇరుక్కుపోయి కిందపడే పరిస్థితి ఏర్పడింది. ఈఓ అనాలోచిత చర్యల వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు మండిపడ్డారు. దివ్యాంగులు, వయోవృద్ధుల భద్రత దృష్ట్యా ఇనుప గ్రిల్స్‌ను వెంటనే తొలగించాలని కోరారు.

Comments

G
Loading comments...