వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం ఆలూరులో రూ.10 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ప్లాస్టిక్ వినియోగ నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంక్‌ను ప్రారంభించారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

