Udayam Digital
Menu

ఆక్వాన్‌ తుపాను ముప్పు తప్పింది

Shruthi Nov 21, 2026 7:03 AM అమరావతిGeneral
ఆక్వాన్‌ తుపాను ముప్పు తప్పింది - Udayam Digital
ఆక్వాన్ తుపాను ఒడిశా వైపు మళ్లి గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ ముప్పు తప్పింది. శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య తుపానుగా తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. శనివారానికల్లా ఇది అల్పపీడనంగా బలహీనపడనుంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఇచ్ఛాపురంలో అత్యధికంగా 16.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...