వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీలో ఇప్పటివరకు కూటమి 18 వార్డులను కైవసం చేసుకుంది. మొత్తం 28 వార్డులకు గానూ 9 ఏకగ్రీవమయ్యాయి. వీటిలో జనసేన 6, తెదేపా 3 వార్డులు దక్కించుకున్నాయి.
మిగిలిన 19 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు తెదేపా 6, భాజపా 2, జనసేన ఒకటి, వైకాపా 2 వార్డుల్లో విజయం సాధించాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Comments
Loading comments...

