Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రింకూను ట్రేడ్ చేయొచ్చన్న ఆకాష్ చోప్రా

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 12, 2026 11:18 AM ఆల్ ఇండియా క్రీడలు
రింకూను ట్రేడ్ చేయొచ్చన్న ఆకాష్ చోప్రా - Udayam
గుజరాత్ టైటాన్స్‌తో ట్రేడ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ రింకూ సింగ్‌ను ఇచ్చే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సూచించారు. ఇందుకు బదులుగా మహ్మద్ సిరాజ్ లేదా గూర్నూర్ బ్రార్ వంటి భారత పేసర్లను తీసుకోవచ్చన్నారు. పంజాబ్ కింగ్స్‌తోనూ గూర్నూర్ బ్రార్-నెహాల్ వధేరా ట్రేడ్ జరిగే అవకాశం ఉందని చోప్రా అభిప్రాయపడ్డారు. అయితే ఇవి తన సూచనలు మాత్రమేనని, వాస్తవంగా ట్రేడ్ జరుగుతుందో లేదో స్పష్టత లేదన్నారు.

Comments

G
Loading comments...