Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగలిలో రైతులకు రికవరీ సొత్తు అందజేత

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 10:23 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఆగలిలో రైతులకు రికవరీ సొత్తు అందజేత - Udayam
ఆగలిలో రెండు నెలలుగా రైతుల వ్యవసాయ మోటార్ల వద్ద చోరీకి గురైన స్టార్టర్లు, కేబుల్ వైర్లను పోలీసులు రికవరీ చేసి రైతులకు అందజేశారు. ఎస్ఐ రంగడు యాదవ్ ఆధ్వర్యంలో నందరజనపల్లెకు చెందిన తిప్పన్న, హెచ్డీ హల్లే తండాకు చెందిన ఆనంద్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి రికవరీ చేసిన రూ.1.50 లక్షల విలువైన కేబుల్ వైర్లు, 4 స్టార్టర్లను సంబంధిత రైతులకు అందించారు. దీంతో రైతులు ఎస్ఐకి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...