Udayam Digital
Menu

ఆదిలాబాద్‌లో రూ.80 పెరిగిన పత్తి ధర

Sai Nath Nov 20, 2026 11:29 AM ఆదిలాబాద్General
 ఆదిలాబాద్‌లో రూ.80 పెరిగిన పత్తి ధర - Udayam Digital
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. శుక్రవారం క్వింటాల్ పత్తికి సీసీఐ రూ.8,667 ధర చెల్లించగా, ప్రైవేటు కొనుగోలుదారులు రూ.9,000 పలికారు. గురువారంతో పోలిస్తే సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేటు మార్కెట్‌లో మాత్రం క్వింటాల్ పత్తి ధర రూ.80 పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...