వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి వ్యవసాయంలో నేడు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పూజారి సత్యనారాయణ తెలిపారు.
బుధవారం గార మండలం వాడాడలో 10 ఎకరాలలో డ్రోన్ సహాయంతో జిల్లేడు ద్రావణం పిచికారీ చేస్తున్నామని వివరించారు. దీని వల్ల సమయం వృధా కాకుండా రైతుకు ఎక్కువ ఆర్థిక భారం పడకుండా ఉంటుందన్నారు . ఎక్కువ సేద్యం ఉన్న చోట ఆధునిక సాంకేతికత పట్ల రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు
Comments
Loading comments...

