వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఆధార్ వివరాల సవరణకు ఆన్‌లైన్ కేంద్రాల వద్ద పడే ఇబ్బందులను తొలగించేందుకు హైదరాబాద్ జీపీవో కొత్త కార్యక్రమం చేపట్టింది. యాజమాన్యం కోరితే, కనీసం 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లోనే ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.
ఆసక్తి గల పాఠశాలలు జీపీవోను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. 15 రోజుల్లోపు పాఠశాల ప్రాంగణంలోనే ఆధార్ నమోదు, సవరణ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

