ఆధార్ పేరు మార్పుపై కొత్త నిబంధనలు

యూఐడీఏఐ ఆధార్‌లో పేరు సవరణలకు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం, ఒక వ్యక్తి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పేరును మార్చుకోవచ్చు. మారుపేర్లు, హోదాలను పేరులో చేర్చేందుకు ఇకపై అనుమతి లేదు.
వివాహం, విడాకులు లేదా డేటా ఎంట్రీ తప్పుల వల్ల పేరు మార్చుకోవాలంటే సంబంధిత గుర్తింపు పత్రాలు లేదా అఫిడవిట్లు సమర్పించాలి. ఈ నిబంధనల ప్రకారమే సవరణలు చేసుకోవాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది.
Comments
Loading comments...
