వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో ఆదివారం కలకలం చోటుచేసుకుంది. గురుకులంలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థినిని పాము కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థినిని వర్ధన్నపేట సామాజిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినికి చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

