Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

4,500 దాటిన ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ బస్సులు

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 6:23 PM జాతీయంవాణిజ్యం
4,500 దాటిన ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ బస్సులు - Udayam
హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ దేశవ్యాప్తంగా 55 నగరాల్లో 4,500కు పైగా ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో మరో 35 ఏసీ విద్యుత్‌ బస్సులను ప్రవేశపెట్టింది. వీటిని ఈవీ ట్రాన్స్‌ సంస్థ నిర్వహించనుంది. ఈ బస్సులు ఇప్పటివరకు 75 కోట్లకు పైగా గ్రీన్‌ కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేశాయని కంపెనీ ఎండీ మహేశ్‌ బాబు తెలిపారు.

Comments

G
Loading comments...