వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీకాకుళం : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 30న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ను మంగళవారం పార్టీ వర్గాలు విడుదల చేశాయి. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి బయలుదేరి 10.45 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం జిల్లా జైలుకు చేరుకుని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్‌లో కలవనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి విశాఖపట్నం విమానాశ్రయానికి బయలుదేరనున్నారు.
Comments
Loading comments...
