Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30 ఏళ్ల నాటి సంకల్పం నెరవేరింది: చంద్రబాబు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 6:37 PM మార్కాపురంGeneral
30 ఏళ్ల నాటి సంకల్పం నెరవేరింది: చంద్రబాబు - Udayam
వెలిగొండ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 30 ఏళ్ల క్రితం తాను తీసుకున్న సంకల్పం నెరవేరిందని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఎన్నో సవాళ్లను అధిగమించి ఫేజ్‌-1 పూర్తి చేశామని, ఈ నెల 31న 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్‌కు విడుదల చేస్తామని తెలిపారు. ఫేజ్‌-1తో 1.19 లక్షలు, ఫేజ్‌-2తో 3.283 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...