Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

25 లక్షల డ్వాక్రా నిధుల దుర్వినియోగం.. కలెక్టర్‌కు మహిళల ఫిర్యాదు.

Follow Udayam on Google
Venu goud Jul 06, 2026 7:37 PM నిర్మల్ General
25 లక్షల డ్వాక్రా నిధుల దుర్వినియోగం.. కలెక్టర్‌కు మహిళల ఫిర్యాదు. - Udayam
నిర్మల్ పట్టణంలోని బ్రహ్మపురి కాలనీకి చెందిన సరస్వతి డ్వాక్రా గ్రూప్ మహిళలు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. గ్రూప్‌కు సంబంధించిన శ్రీనిధి ఆర్పీ కవిత తమకు తెలియకుండా దాదాపు రూ.25 లక్షల నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. బ్యాంకు నుంచి రికవరీ నోటీసులు వచ్చిన తర్వాతే ఈ విషయం తమకు తెలిసిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వినియోగమైన రూ.23 లక్షలను రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...