వార్తలకు తిరిగి వెళ్లండి
వైరల్ వార్తలుBreaking
భారత్-బహ్రెయిన్ చర్చలు సక్సెస్
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బహ్రెయిన్ రాజధాని మనామాలో పర్యటించారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ విదేశాంగ మంత్రి అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీతో పాటు అక్కడి అగ్రనాయకత్వాన్ని కలిసి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై కీలక చర్చలు జరిపారు.
పశ్చిమ ఆసియాలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీ సంక్షేమంపై బహ్రెయిన్ చూపుతున్న శ్రద్ధకు జైశంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Loading comments...