వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లాలో 22ఏ నిషేధిత జాబితా నుంచి 2,044.18 ఎకరాల భూములకు విముక్తి లభించిందని కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
కలిదిండి మండలంలో 287 మంది రైతులకు గతంలో 1,548.51 ఎకరాలకు 1983 పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. తాజాగా మరో 495.67 ఎకరాలను జాబితా నుంచి తొలగించడంతో 158 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
Comments
Loading comments...

