వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ, భూ భారతి పేరుతో ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన మహాధర్నాకు నిర్మల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన మహాధర్నాకు కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, జిల్లా, మండల, గ్రామస్థాయి పదాధికారులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
Comments
Loading comments...

