Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22.60 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత బొలెరో సీజ్ నలుగురిపై కేసు

Follow Udayam on Google
raju Sep 01, 2026 9:27 PM నిజామాబాద్General
22.60 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత బొలెరో సీజ్  నలుగురిపై కేసు - Udayam
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించేందుకు తరలిస్తుండగా నందిపేట్ పోలీసులు పట్టుకున్నారు. రైతుఫామ్ శివారులో మంగళవారం తెల్లవారుజామున నిర్వహించిన తనిఖీల్లో 48 సంచుల్లో ఉన్న 22.60 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నందిపేట్ ఎస్ఐ కె.వినయ్ తెలిపారు. బొలెరో వాహనాన్ని సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...