Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లకుంటలో 15 కిలోల భారీ వాల్గూ చేప

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 31, 2026 2:52 PM సిద్దిపేటGeneral
గొల్లకుంటలో 15 కిలోల భారీ వాల్గూ చేప - Udayam
బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామ శివారులోని గొల్లకుంటలో ఓ మత్స్యకారుడి వలకు 15 కిలోల భారీ వాల్గూ చేప చిక్కింది. గ్రామానికి చెందిన నేరెళ్ల పార్షయ్య చేపల వేటకు వెళ్లగా ఈ చేప లభించింది. భారీ చేప చిక్కడంతో పార్షయ్య ఆనందం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చేరుకుని చేపను ఆసక్తిగా తిలకించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...