Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12 రోజుల మగబిడ్డ విక్రయం.. కేసు నమోదు

Follow Udayam on Google
Sai Jun 11, 2026 7:55 AM హైదరాబాద్General
12 రోజుల మగబిడ్డ విక్రయం.. కేసు నమోదు - Udayam
తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించిన 12 రోజుల మగబిడ్డను రూ.1.70 లక్షలకు అక్రమంగా విక్రయించిన ఘటన వెలుగుచూసింది. సంతానం లేని దంపతులకు మధ్యవర్తుల ద్వారా కన్నవారే ఈ శిశువును విక్రయించారు. చట్టపరమైన నిబంధనలు పాటించకుండా ఈ లావాదేవీలు జరిగాయి. ఈ ఘటనపై కుల్సుంపురా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసును నందిగామ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం బాలుడిని శిశు విహార్‌కు తరలించి, నిందితులపై దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...