Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

108 ఉండ్రాళ్లతో లక్ష్మీ గణపతికి మోదకార్చన

Follow Udayam on Google
Jogarao Sep 22, 2026 12:13 PM శ్రీకాకుళంGeneral
108 ఉండ్రాళ్లతో లక్ష్మీ గణపతికి మోదకార్చన - Udayam
శ్రీకాకుళం నగరంలోని మొండేటివీధి లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రత్యేక పూజల్లో భాగంగా 108 ఉండ్రాళ్లతో అష్టోత్తర సహిత మోదకార్చన నిర్వహించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్లతో అర్చన చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నగరం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...