వార్తలకు తిరిగి వెళ్లండి
గుమ్మలక్ష్మీపురం కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం మహిళల ఆధ్వర్యంలో మహా ప్రసాదం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
మహిళలు స్వయంగా తయారు చేసిన 108 రకాల పిండివంటలను మహాగణనాథునికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం పారాయణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

