Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

100 శాతం ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు పూర్తి

Follow Udayam on Google
AILENI VIKRAM Jul 28, 2026 10:14 PM జగిత్యాలGeneral
100 శాతం ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు పూర్తి - Udayam
రాయికల్ మండలం మంత్యనాయక్ తండా (బొడ్డిలింగాపూర్)లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా 100 శాతం ఓటరు నమోదు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. బీఎల్‌వోలు నిర్వహించిన ఇంటింటి సర్వే ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తిరుపతి, ఉపసర్పంచ్ సూర్యనాయక్, పంచాయతీ కార్యదర్శి మోనిక, జీపీబీటీ సిబ్బంది లక్ష్మి పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...