వార్తలకు తిరిగి వెళ్లండి

హవేలిఘనపూర్ మండల కేంద్రంలోని పశువైద్యశాల మంగళవారం ఉదయం 10 గంటలు దాటినా తెరుచుకోలేదని పాడి రైతులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పశువులతో వచ్చిన రైతులు వైద్యం కోసం వేచి చూశారు.
పశువులను చూసేందుకు రావాలని కోరినా సిబ్బంది నిరాకరించారని రైతులు ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులను పంపిస్తామని, డబ్బులు చెల్లించాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

