వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ మాజీ డీజీపీ శివధర్ రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల పదవీ కాలంతో పాటు ఆయనకు సీఎస్ స్థాయి హోదా కల్పించారు. శాంతిభద్రతలు, అంతర్గత భద్రతపై ఆయన ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయనున్నారు.
నార్కోటిక్స్ నియంత్రణ, నేరాల అదుపుపై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నారు. మరోవైపు రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ మే 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. కీలక మార్పులతో పోలీస్ వ్యవస్థలో నూతనోత్సాహం నెలకొంది.
Comments
Loading comments...

