Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు సెటైర్లు!

Follow Udayam on Google
Udayam Staff May 02, 2026 2:38 PM హైదరాబాద్రాజకీయాలు
కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు సెటైర్లు! - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ విషయంలో మాట తప్పిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కుకునూర్‌పల్లిలో ఆయన మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి సర్కార్ రైతుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పెరిగిన భూముల ధరలు నేడు పడిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. కనీసం జీవాలకు నట్టల మందు వేయడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావట్లేదని హరీశ్‌రావు ఘాటుగా విమర్శించారు.

Comments

G
Loading comments...