వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్‌లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ప్లేయర్‌గా రిటైర్ అయిన యువీ, త్వరలోనే ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచే అతడు ఈ సరికొత్త బాధ్యతలు తీసుకోనున్నట్లు లీగ్ వర్గాల సమాచారం. దిల్లీ ఫ్రాంచైజీతో యువీ చర్చలు దాదాపు ముగిశాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Loading comments...

