Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్ అదుపుతప్పి యువకుడు బలి

రచన దేవి Jul 11, 2026 7:16 AM కాకినాడ 2 viewsabout 1 hour ago
బైక్ అదుపుతప్పి యువకుడు బలి - Udayam Digital
కాకినాడ జిల్లా ఎ.కొత్తపల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్ల మణికంఠ (23) అనే యువకుడు దుర్మరణం చెందాడు. అన్నవరం నుంచి స్వగ్రామమైన ఏవీ నగరం వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో తీవ్ర గాయాలై ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...